Latest Posts

తమిళనాడులో భాషా రాజకీయం..! బడ్జెట్ లోగో నుంచి ఏకంగా రూపాయి సింబల్‌ను లేపేసిన సీఎం..

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2025-26 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ లోగోలో అధికారిక రూపాయి చిహ్నాన్ని తొలగించి, దాని స్థానంలో తమిళ అక్షరమైన ‘రు’ ను ప్రవేశపెట్టడం వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయంపై బీజేపీ,….

AP

జనసేనా ఆవిర్భావ వేడుకులకు ముస్తాబైన పిఠాపురం..!

ఏపీ అధికారంలో భాగస్వామ్యం తర్వాత జనసేన తొలి ఆవిర్భావ సభ జరగనుంది. కేవలం రెండు కీలక అంశాలు ఎజెండాగా సాగనుంది ఈ సభ. జయ కేతనం పేరుతో జరగుతున్న ఈ ప్లీనరీలో సనాతన ధర్మ పరిరక్షణ, పార్టీ విస్తరణ ప్రధానంగా చెబుతున్నారు….

AP

వైఎస్ వివేకా హత్య కేసు సాక్షుల వరుస మరణాలు… దస్తగిరికి భద్రత పెంపు..

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు వరుసగా అనుమానాస్పదంగా మృతి చెందుతుండటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో, ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరికి పోలీసులు భద్రతను పెంచారు. ప్రస్తుతం దస్తగిరికి 1 ప్లస్ 1 సెక్యూరిటీ….

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం..

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి ఒకరు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా….

బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు జగదీశ్ రెడ్డి సస్పెన్షన్..

తెలంగాణ అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెండ్ చేశారు. జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని స్పీకర్ తెలిపారు.   సభాపతిపై….

బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు..!

ఫామ్ హౌస్ లో కోడి పందేల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు మాదాపూర్ లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అతికించారు. శుక్రవారం తమ ముందుకు విచారణకు హాజరుకావాలని….

యూట్యూబ్‌లో చూసి గోల్డ్ స్మగ్లింగ్ నేర్చుకున్నా.. డీఆర్ఐ విచారణలో నటి రన్యారావు..

దుబాయ్ నుంచి అక్రమంగా 14.2 కేజీల బంగారం తీసుకొస్తూ దొరికిపోయిన నటి రన్యారావు విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. దుబాయ్ నుంచి గతంలో ఎన్నడూ బంగారం తీసుకురాలేదని, ఇదే తొలిసారని ఆమె తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది. స్మగ్లింగ్ చేయడం….

క్రిప్టో కరెన్సీ పేరిట జగిత్యాలలో రూ.70 లక్షలకు టోకరా..

జగిత్యాలలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. క్రిప్టో బిజినెస్ పేరుతో సుమారు రూ.70 లక్షల వరకు రాకేశ్ అనే వ్యక్తి పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని బాధితులు ఆందోళన చేపట్టారు. జగిత్యాలకు చెందిన రాకేశ్ తమతో మెటఫండ్ అనే కంపెనీలో పెట్టుబడి….

AP

తిరుమల కొండపై అక్రమ నిర్మాణాలు… హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు..

తిరుమల పుణ్యక్షేత్రంలో నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మఠాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తిరుమలలో నిర్మాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీకి సూచించింది…..

AP

మే నెల నుంచి సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు: మంత్రి నాదెండ్ల..

కాకినాడ రూరల్ నియోజకవర్గం పండూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి, ప్రతి ఇంటికి సంక్షేమం చేరాలనే లక్ష్యంతో….