ముదిగుబ్బ ఫిబ్రవరి 1 :- (YES 9TV) :- కిడ్నీ వ్యాధిగ్రస్తునికి ముదిగుబ్బ వైసిపి మండల ఉపాధ్యక్షులు వేలూరి చంద్రమోహన్ నాయుడు (మీసేవ చంద్ర) ఆర్థిక సాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
ముదిగుబ్బ పాతూరు కు చెందిన అన్నమనేని సత్యనారాయణ గత ఆరు సంవత్సరాల నుండి కిడ్నీల వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని అనుచరులతో తెలుసుకున్న ముదిగుబ్బ వైసీపీ మండల ఉపాధ్యక్షులు మీసేవ చంద్ర , ఆ రోగి బాగోగుల నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.అలాగే ఆ వ్యాధిగ్రస్తునికి అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా కలిగించారు. ముదిగుబ్బ మండల కేంద్రంలోని స్థానిక వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించిన కమ్మ సామాజిక సంఘం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ ఆర్థిక సాయం చేశారు.
వైసీపీ నేత ఉదారత: కిడ్నీ వ్యాధిగ్రస్తుడికి ఆర్థిక సాయం చేసిన వేలూరి చంద్రమోహన్ నాయుడు
