అనంతపురం జిల్లా-కళ్యాణదుర్గం
పండుగ వాతావరణం లో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆమీలినేని సురేంద్రబాబు
*
అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామంలో పండుగ వాతావరణంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. అదే సమయంలో “ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పర్యటించారు. కంబదూరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించిన ఎమ్మెల్యే ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే నెల మొదటి తేదీ కావడంతో నిర్వహించిన సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తాగునీటి సమస్య, రహదారుల అభివృద్ధి, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, సాగునీటి సౌకర్యాలు, రైతుల సమస్యలు తదితర అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి వినతిపత్రాలు సమర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
బైట్: అమిలినేని సురేంద్రబాబు, ఎమ్మెల్యే, కళ్యాణదుర్గం.
