తాడిమర్రిలో విషాదం: కారు-బైక్ ఢీకొని 13 ఏళ్ల బాలుడు మృతి

మండల కేంద్రంలోని తాడిమర్రి గ్రామానికి చెందిన డ్రైవర్ రామకృష్ణ కుమారుడు సి. ఓం సాయి (వయసు 13) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
వివరాల్లోకి వెళితే, సి. ఓం సాయి రామకృష్ణ మేనల్లుడు ఆకాష్ తో కలిసి ద్విచక్ర వాహనంపై కాశిరెడ్డి నాయన సమీపం నుంచి తిరుగు ప్రయాణంగా ఇంటికి వస్తుండగా, తాడిమర్రి వైపు నుంచి పెద్దకోట్ల వైపు వెళ్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదానికి గురైన వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆర్డిటి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే సి. ఓం సాయి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆకాష్‌కు చికిత్స కొనసాగుతోంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి వివరాలను ఎంక్వయిరీ అనంతరం వెల్లడిస్తామని తెలిపారు. ఫోటో మరణించిన ఓం సాయి ఫైల్ ఫోటో

Posted Under AP
Editor