* ముదిగుబ్బ జనవరి 31 :- (YES 9 TV):- వైఎస్ఆర్‌సీపీ అహంకార రాజకీయానికి టీడీపీ గట్టి హెచ్చరిక*
చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై వైఎస్ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ముదిగుబ్బ మండలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు
.
ముదిగుబ్బ మండల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ శ్రీ తుమ్మల మనోహర్ నాయకత్వంలో తెలుగు తమ్ముళ్ల, కార్యకర్తలు భారీగా రోడ్డెక్కి, ముదిగుబ్బ నడిబొడ్డున అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధంచేస్తూ తీవ్ర నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు అంబటి రాంబాబు పై గంట, అరగంట, సుకన్య, సంజన, ఆంబోతు అనే నినాదాలతో ముదిగుబ్బ ప్రాంతం ఉర్రూతలూగింది.
ఈ సందర్భంగా తుమ్మల మనోహర్ మాట్లాడుతూ…. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వైఎస్ఆర్‌సీపీ నాయకులకు ఇప్పుడు ప్రజలే గుణపాఠం చెబుతున్నారని, ఆ రాజకీయ నిరాశలో భాగంగానే అంబటి రాంబాబు ఇలాంటి అసభ్య, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. వైఎస్ఆర్‌సీపీ నాయకులకు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.
గడిచిన ఐదేళ్లలో గాడి తప్పిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు జీవం పోస్తూ రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదులు వేస్తూన్న… నాయకుడిపై వ్యక్తిగత దూషణలు చేయడం వైఎస్ఆర్‌సీపీ మానసిక దివాలాకోరుతనానికి నిదర్శనమని మనోహర్ ఘాటుగా విమర్శించారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలకు హద్దులు ఉంటాయని, వ్యక్తిగత దూషణలు, అసభ్య వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలను కాలరాసే చర్యలని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజా నాయకుల గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రజలను తప్పుదారి పట్టించే కుట్రగా భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
వైఎస్ఆర్‌సీపీ నాయకులకు మొదట ఇలాంటి దూషణలతోనే పతనం ఆరంభమైందన్నారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని బాధ్యతాయుత రాజకీయ సంస్కృతిని పాటించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నందున అంబటి రాంబాబు పై స్థానిక పోలీస్ స్టేషన్ ముదిగుబ్బ నందు అంబటి రాంబాబు పై కఠిన చర్యలు తీసుకోవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు.
భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారిపై ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతమైన ఉద్యమాలు చేపడతామని టీడీపీ శ్రేణులు స్పష్టం చేశాయి.
