Latest Posts

ముస్లింల దశాబ్దాల కల నెరవేర్చిన ఎమ్మెల్యే కందికుంట: రూ. 55 లక్షలతో ఈద్గా అభివృద్ధి పనులు ప్రారంభం, షాదీ మహల్‌పై భరోసా

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి

కదిరి లో ఈద్గా ఖబరస్తాన్ లో 55 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం, ఐమాక్స్ లైట్ల ఏర్పాటు

దీర్ఘకాలిక సమస్య పరిష్కారం పై హర్షం వ్యక్తం చేసిన మైనార్టీలు

కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారిని ఘనంగా సత్కరించిన ముస్లిం మత పెద్దలు

శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో ఈద్గా ఖబరస్తాన్ లో దీర్ఘకాలిక సమస్యలను ఇచ్చిన మాటకు కట్టుబడి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పరిష్కరించారు. 55 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం ఐమాక్స్ లైట్లు ముస్లిం మత పెద్దలతో కలిసి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావడం పట్ల ముస్లిం మత పెద్దలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈద్గా లో నెలకొన్న సమస్యలను పరిష్కరించామని, గతంలో నిర్మించిన షాదీ మహల్ ను పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాన్నారు. 2 నెలల్లో షాది మహల్ ను పూర్తి చేస్తానని ముస్లింలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ముస్లిం పేద ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా చర్యలు చేపడతామన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

Posted Under AP
Editor