Latest Posts

ఆస్పరిలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన.. ‘సంజీవని ప్రాజెక్ట్’ వివరాలు వెల్లడించిన కలెక్టర్ డాక్టర్ సిరి

కర్నూలు జిల్లా
ఆస్పరి మండల కేంద్రంలో

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్, బహిరంగ సభ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తదితర ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి గారు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డీస్పీ వెంకటరామ్మయ్య.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సంజీవని ప్రాజెక్ట్ మరియు ప్రజారోగ్య రక్షణ కార్యక్రమం గురించి డాక్టర్ సిరి వివరించారు

ఈ ప్రాజెక్ట్ కింద పీహెచ్‌సీల్లో వైద్యుల కన్సల్టేషన్, ఓపీ సేవలు, ఉచిత మందులు పంపిణీ మరియు వివిధ పరీక్షలు సమర్థవంతంగా అమలయ్యేలా చూస్తున్నామని వివరించారు.

సురక్షిత మాతృత్వం :

గర్భం దాల్చిన సమయం నుండి ప్రసవం అయ్యే వరకు మరియు ప్రసవం తర్వాత కూడా తల్లి ఆరోగ్యం, మానసిక భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది.

తల్లి ఆరోగ్యంతో పాటు శిశువు పోషకాహారం మరియు టీకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

భాగస్వామ్య పెంపకం
గర్భధారణ సమయంలో మరియు బిడ్డ పుట్టిన తర్వాత కేవలం తల్లి పైనే కాకుండా, తండ్రి మరియు సంయుక్త కుటుంబం అందించాల్సిన సహకారంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు.

ఆరోగ్య రథాలు & ఇతర ప్రణాళికలు:
మొబైల్ ఆరోగ్య పరీక్షల కోసం ఆరోగ్య రథం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వీటితో పాటు ప్రజారోగ్య పరిరక్షణకై ‘ప్రజా వేదిక’ సదస్సులు సమావేశాల ద్వారా అవగాహన పెంపొందిస్తున్నారు.

Posted Under AP
Editor