తాడిమర్రి (yes9tv)నాయనపల్లెలో ఘనంగా గంగమ్మ జాతర బోనాల కార్యక్రమం
తాడిమర్రి మండలంలోని నాయనపల్లె గ్రామంలో ఉగాది పండుగ ముగిసిన అనంతరం శుక్రవారం గంగమ్మ జాతర బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు సంప్రదాయ బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని గంగమ్మ తల్లిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.
జాతర సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, డోలు తాశాల నాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. గ్రామస్తులు, యువత, పెద్దలు అందరూ కలిసి జాతరను విజయవంతం చేశారు.
నాయనపల్లెలో ఘనంగా గంగమ్మ జాతర బోనాల కార్యక్రమం…
