ముదిగుబ్బ ఫిబ్రవరి 03:- ( YES 9 TV):-
ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం షాబాన్ నెలలో చాంద్రమాన 15వ రోజు రాత్రి షబే బరాత్ ( జాగారం ) పాటించడం ఆనవాయితీగా వస్తోంది . అందులో భాగంగా ముదిగుబ్బ మండల వ్యాప్తంగా అన్ని మసీదులు సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ రాత్రిలోనే దివ్య ఖురాన్ అవతరించినట్లు ఇస్లామిక్ గ్రంథాలు చెబుతాయి. కావున మనం తెలిసి తెలియక చేసిన పాపాలు ( తప్పుల ) ను గురించి ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దగ్గర క్షమాపణ కోరితే ఆ దయామయుడు అల్లాహ్ తప్పక క్షమిస్తాడని ప్రగాఢ విశ్వాసం గల రాత్రిగా ఈ షబేబరాత్ ప్రతీతి . రాత్రంతా దైవ ధ్యానంలో, నమాజులు, ప్రార్థనలు, దివ్య ఖురాన్ పఠనం తో ఆ కరుణామయుడు అ ల్లాహ్ కృప కు పాత్రులు కాగలం అని ముస్లిం సోదరుల నమ్మకం.
