అంగనవాడీల బడ్జెట్ నిరాశ: వేతనాల పెంపు లేకపోవడంపై భగ్గుమన్న కార్యకర్తలు

2026–27 బడ్జెట్‌లో అంగనవాడీలకు నిరాశ… సరిపడని జీతాల కేటాయింపుపై అంగనవాడి వర్కర్ల నిరసన
వివరాలు:
2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో అంగనవాడి వర్కర్లకు సరిపడిన జీతాల కేటాయింపు చేయకపోవడంపై అంగనవాడి వర్కర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలు, కుటుంబ పోషణ భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నారుల పోషణ, గర్భిణీలు–పాలిచ్చే తల్లులకు సేవలు అందిస్తూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ జీతాలు మాత్రం జీవన వ్యయాలకు సరిపోవడం లేదని వర్కర్లు పేర్కొన్నారు. వెంటనే జీతాల పెంపుతో పాటు ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించి అంగనవాడి వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని నిరసనకారులు కోరారు.

Posted Under AP
Editor