వికసిత భారత్ దిశగా అడుగులు: బడ్జెట్ 2026-27ను కొనియాడిన దేవర రామమోహన్

బడ్జెట్ 2026-2027 సాధారణ బడ్జెట్ కాదు వికసితభారత్ బడ్జెట్ అని కొనియాడిన మండల అధ్యక్షులు దేవర రామమోహన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వరుసగా తొమ్మిదవ సారి దేశ బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టి ప్రపంచంలోనే అరుదైన రికార్డులు సాధించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ నిర్మల సీతారామన్ గారికి భారతదేశ ప్రజల తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ఈ బడ్జెట్ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే బడ్జెట్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి అభివృద్ధి కొరకు(ఏ డి బి నిధులు) 1128.19 వేల కోట్లు కేటాయించడం జరిగినది.
అమరావతి పట్టణ అభివృద్ధి కొరకు (ఐ బి ఆర్ డి నిధులు) 432.09 కేటాయించడం జరిగినది.
ఏపీ గ్రామీణ రహదారుల కొరకు 500.99 కోట్లు.
ఏపీలో పట్టణ తాగు,మురుగునీటి పారుదల నిర్వహణకు 800 కోట్లు.
ఏపీలో ప్రకృతి వ్యవసాయానికి 150.32 కోట్లు.
ఏపీలో రహదారులు, వంతెనలు పునర్నిర్మానం కొరకు 350 కోట్లు.
ప్రత్యేకంగా ఏడు హై స్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేయడం
ముంబై-పూణే, పూణే-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి.
సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యసాధన కోసం ఇండస్ట్రియల్ కారిడార్లను పెంచడం, ప్రత్యేకంగా ఎడ్యుకేషనల్ కారిడార్లను ఏర్పాటు చేయడం తద్వారా క్వాలిటీ ఎంప్లాయిస్ ని దేశానికి ఇవ్వాలన్న లక్ష్యం,ఐటీ మరియు డేటా రంగానికి వికసిద్భారత్ దిశగా బడ్జెట్లో కేటాయించడం జరిగినది, ఎం ఎస్ ఎమ్ ఈల ఛాంపియన్ సృష్టికోసం ప్రత్యేకంగా 10000 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగినది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక గొప్ప గొప్ప అంశాలు ఈనాటి బడ్జెట్లో ఉన్నాయి వాటన్నిటిని ఈ దేశ ప్రజలు ఆహ్వానిస్తున్నారు ఈ సందర్భంగా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఆదరిస్తున్నారు ఈ సందర్భంగా దేశ ప్రజల తరఫున వికసితభారత్ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఇట్లు
బిజెపి మండల అధ్యక్షుడు
దేవర రామ్మోహన్

Posted Under AP
Editor