ముదిగుబ్బ ఫిబ్రవరి 1 2026:- (YES 9 TV):- మండలంలోని కమ్మ కులస్తుల ఐక్యతకు కృషిచేసి తద్వారా కమ్మ కులస్తులు అన్ని విధాల అభివృద్ధిలో పాటలో పయనించే విధంగా ప్రతి కమ్మ కులస్తుడు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆదివారం ముదిగుబ్బలో వాసవి కల్యాణ మండపంలో జరిగిన మండల కమ్మ సంఘం సమావేశంలో పాల్గొన్న ధర్మవరం కాకతీయ కమ్మ సేవా సంఘం నాయకులు పిలుపునిచ్చారు, మండల కమ్మ సంఘం ఏర్పాటులో భాగంగా ధర్మవరం కాకతీయ కమ్మ సేవా సంఘం నాయకులు మండల కమ్మ కులస్తులతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పలువురు కమ్మ సంఘం నాయకులు మాట్లాడుతూ కమ్మ సోదరులందరూ రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐక్యతతో ముందుకు నడవాలి అన్నారు, కమ్మ కులస్తులు ఐకమత్యంతో కమ్మ సంఘాల ఏర్పాటు చేసుకొని తద్వారా కమ్మ సామాజిక వర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవాలన్నారు, ముఖ్యంగా కమ్మ కులంలో ఎవరైనా పేదరికంలో ఉండి వారు ఆర్థికంగా,విద్యాపరంగా, అనారోగ్యపరంగా ఇబ్బందుల్లో ఉంటే వారిని ఆదుకోవడానికి కృషి చేయాలని పేర్కొన్నారు, ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి హాజరైన కమ్మ కులానికి చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తుడు అన్నమనేని సత్తి అనే వ్యక్తికి ఈ కార్యక్రమంలో కమ్మ సంఘం నాయకులు పిలుపుమేరకు ఈ సమావేశం విచ్చేసిన కమ్మ కులస్తులు ఎవరికి తోచిన విధంగా వారు సుమారు 90000 రూపాయలు విరాళాల అందించి పేదరికంలో ఉన్న కమ్మవారి పట్ల తమకున్న సేవాభావాన్ని చాటుకున్నారు, మండలంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటుచేసిన మండల కమ్మ సంఘం సమావేశానికి సుమారు 300 మంది కమ్మ కులస్తులు హాజరు కావడంతో ఈ కార్యక్రమం నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో ధర్మవరం కమ్మ సంఘం నాయకులు పాలడుగు సురేష్, జాస్తి కృష్ణమోహన్, తమ్మినేని జయసింహ, దోనాదుల విజయ్ కుమార్, రాంపురం శీన తదితరులతోపాటు ముదిగుబ్బ మండల కమ్మ సంఘo నాయకులు అన్నమనేని ప్రభాకర్, భాషనేని రమేష్ బాబు, మాలపాటి రామకృష్ణ, తుమ్మల మనోహర్, మీసేవ చంద్రమోహన్, సోమల ప్రకాష్, గుత్తా నాయుడు, ముక్తాపురం సర్పంచ్ హరి, గనపర్తి లక్ష్మీనారాయణ, జంపు నాయుడు తదితరులు పాల్గొన్నారు,
ముదిగుబ్బలో కమ్మ సంఘం మండల స్థాయి సమావేశం: కుల ఐక్యతతోనే సర్వతోముఖాభివృద్ధి
