శ్వాసనాళంలో ఇరికిన పిన్నీస్.. నరకయాతన అనుభవించిన ఐదు నెలల బాబు..

పిల్లలను ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటు ఉండాలి. ముఖ్యంగా వారు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే వారికి ఈ వయస్సులో ఏమి తెలియదు. ముఖ్యం ఏడాది లోపు పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

ఎందుకంటే వారు ఏం జరిగిన చెప్పలేరు. కేవలం ఏడుస్తారు అంతే. అందుకే వారిని గమనించుకుంటూ ఉండాలి. తాజాగా ఐదు నెలల బాలుడు శ్వాసనాళంపై పిన్నీసు(కాంట) ఇరుక్కుని విలవిలలాడాడు.

పశ్చమ బెంగాల్ లోని కల్ కతాలో 5 నెలల బాలుడి శ్వాసనాళంపైన ఇరుక్కున్న పిన్నీసు వైద్యులు బయటకు తీశారు. బుధవారం హుగ్లీలోని జంగిపారకు చెందిన ఐదు నెలల బాలుడిని తల్లి మంచపై పడుకోబెట్టింది. బాలుడు తొబుట్టులతో ఆడుకుంటూ పిన్నీసు మింగాడు. ఊపిరి ఆడకపోవడంతో గుక్క పెట్టి ఏడవడం మొదలు పెట్టాడు. దీంతో బాబును తల్లిదండ్రులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. జలుబు అని భావించిన వైద్యుడు అందుకు తగ్గట్లుగా మెడిసిన్ రాశాడు.

అయినా బాలుడు ఏడుపు ఆపకపోవడంతో తల్లిదండ్రులు కల్ కత్తాలోని వైద్య కళాశాలకు తరలించారు. అక్కడ వైద్యులు ఎక్స్ రే తియగా అస్సలు విషయం బయట పడింది. బాలుడి శ్వాననాళంపై పిన్నీస్ ఇరుక్కుపోయిందని గుర్తించారు. అయితే శ్వసనాళంలోపలికి వెళ్లకపోవడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది. ఈఎన్‌టీ విభాగం వైద్యుడు సుదీప్‌దాస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం డాక్టర్లు దాదాపు 40 నిమిషాలపాటు శస్త్రచికిత్స చేసి పిన్నీసును బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కొద్ది రోజుల క్రితం పంజాబ్‌లోని మోగాలోని మెడిసిటీ హాస్పిటల్‌లో గురువారం మూడు గంటల శస్త్ర చికిత్స అనంతరం 40 ఏళ్ల వ్యక్తి కడుపు నుంచి ఇయర్‌ఫోన్‌లు, లాకెట్లు, స్క్రూలు, రాఖీలు, సేఫ్టీ పిన్స్, షర్ట్ బటన్లు, జిప్‌లతో సహా వస్తువులను తొలగించిన విషయం తెలిసిందే. కుల్దీప్ సింగ్ అనే వ్యక్తి మతిస్థిమితం లేదు. అతను ఇబ్బంది పడుతుండడంతో గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సలహా మేరకు స్కాన్ చేయించగా.. అతని కడుపు లోపల అనేక లోహ వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. ప్రక్రియ తర్వాత వైద్యులు అతని శరీరం నుంచి వస్తువులను సమర్థవంతంగా బయటకు తీశారు.

YES9 TV