సూర్యగ్రహణం ఎప్పుడు? సూతక కాలం ఎవరు పాటించాలి?

వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణం అనేది ఒక ముఖ్యమైన ఖగోళ సంఘటన. 2023 సంవత్సరంలో రెండు సూర్య గ్రహణాలు ఉండగా మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్ నెలలో సంభవించింది.

ఇక రెండవ చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14వ తేదీన రాత్రి ఎనిమిది గంటల 30 నిమిషాలకు సంభవించబోతుంది. ఇది అక్టోబర్ 15వ తేదీన ఉదయం 2. 25 నిమిషాలకు ముగుస్తుంది.

అశ్విని మాసంలోని కృష్ణపక్ష అమావాస్య ఆదివారం రోజున ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదని చెబుతున్నారు. మరి భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించనప్పుడు భారత దేశంలో సూర్య గ్రహణ ప్రభావం ఉంటుందా అనేది చాలామంది ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. దీనికి సూతక కాలం ఉంటుందా? భారతదేశంలో సూతక కాలాన్ని పాటించాలా? అనేది చాలామందిలో జరుగుతున్న చర్చ.

2023వ సంవత్సరంలో చివరి సూర్య గ్రహమైన ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి దేశంలో సూతక కాలం గమనించనవసరం లేదని చెబుతున్నారు .ఎక్కడైతే గ్రహణం కనిపిస్తుందో అక్కడ మాత్రమే సూతక కాలాన్ని పాటిస్తారని చెబుతున్నారు. కాబట్టి భారతదేశంలోని ప్రజలు సూర్యగ్రహణం రోజు కూడా తమ కార్యకలాపాలను కొనసాగించవచ్చు. ఈసారి ఏర్పడే సూర్యగ్రహణం కంకణాకార సూర్యగ్రహణం, రింగ్ ఆఫ్ ఫైర్ అని చెబుతున్నారు.

సూర్య గ్రహణం సమయం లో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభావాలు కనిపిస్తాయి. సూర్యగ్రహణం సమయంలో సూర్యుడు, చంద్రుడు ఇద్దరు చిత్ర నక్షత్రంలో ఉంటారు. కాబట్టి చిత్రా నక్షత్రంలో పుట్టిన రాశి చక్ర జాతకులు ప్రతికూలంగా ప్రభావితం అవుతారు. ఈ సమయంలో ప్రతికూల శక్తులు వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. సూర్యుడు కంటికి కారకుడు కాబట్టి కన్య రాశి జాతకులు కంటి సమస్యలను ఎదుర్కొంటారు.

ఈసారి సూర్య గ్రహణం ఫలితంగా వివిధ రకాల జ్వరాలు, అలర్జీలు, అంటువ్యాధులు, వైరస్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. గ్రహణం ప్రభావం కారణంగా అంగారక గ్రహం ప్రమాదాలకు ప్రాతినిధ్యం వహించే గ్రహం కావడంతో అనేక పెద్ద మెట్రోపాలిటన్ నగరాలలో హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఈ గ్రహణం దేశం మరియు ప్రపంచంపై వినాశకరమైన ప్రభావాలను చూపిస్తుందని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

YES9 TV