తమన్నా ఇప్పుడు నార్త్, సౌత్ అనే తేడాలు లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఆమె నటిస్తున్న సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి.
కాగా ఇప్పుడు ఎక్కువగా సీనియర్ హీరోల సరసన నటిస్తోంది. సౌత్ లో చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సాగర్ మహతి మ్యూజిక్ అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి మిల్కీ బ్యూటీ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వచ్చాడు. ఆయన ఈ పాటను రిలీజ్ చేశారు. అయితే ఈ ఈవెంట్ లో
తమన్నా
మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడు అందరూ నన్ను మిల్కీ బ్యూటీ అని పిలిచేవారు.
ప్రత్యేక అనుబంధం ఉంది..
వారు నా కలర్ గురించే అలా మాట్లాడుతున్నారేమో అనుకున్నాను. కానీ ప్రేక్షకుల్లో కలర్ మాత్రమే కాదు.. నాపై ప్రేమను ఇలా చూపిస్తున్నారని అర్థం చేసుకున్నాను. ఇక ఇప్పుడు ఇదే పేరుతో పాట రావడం చిరు దానికి స్టెప్పులు వేయడం సంతోషంగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది.
నేను సెట్ లో ఉన్నప్పుడు చిరంజీవి గారు నన్ను తమన్ అని పిలుస్తారు. అప్పుడు నువ్వు కూడా అక్కడే ఉన్నావనే ఫీలింగ్ నాకు కలుగుతుంది. నువ్వు నాలో సగం అయిపోయావు అంటూ చిలక పలుకులు పలికింది ఈ బ్యూటీ. అయితే ఈ మాటలు ఒక రకంగా
థమన్