ఒక రాష్ట్రం అభివృద్ధి అంటే కొంత మంది వ్యాపారులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు డబ్బులు సంపాదించడం అనేది
టీడీపీ
నినాదం. కానీ ఒక రాష్ట్రం అభివృద్ధి అంటే అందులో ఉన్న ప్రజలందరూ అభివృద్ధి చెందాలనేది జగన్ నినాదం.
ఆ నినాదమే ఈ రోజు రాష్ట్రాన్ని పేదరికం నుంచి బయట పడేస్తోంది. ఈ విషయం మేం చెప్పట్లేదు. కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.
మనం చేసే పని మనం చెప్పుకుంటే గొప్ప కాదు. ఎల్లలు దాటి దేశమంతా చెప్పుకోవాలి. ఇప్పుడు
జగన్
గురించి దేశమే చెబుతోంది. అన్ని వర్గాలు, అందరు ప్రజల గురించి ఆలోచించి ఆయన వేసిన విత్తనం నేడు పచ్చని చెట్టులా మారింది. పేదరికం అనేది ఏపీ ప్రజల ఇండ్లలోకి వెళ్లాలంటే ముందు జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను దాటాలని చెబుతున్నాయి.
అవి పేదల బతుకులకు కంచెలా కాపలా కాస్తున్నాయి. 2016లో ఆంధ్రాలో పేదరికం 11.7 శాతం ఉండేది. కానీ 2021 నాటికి అది కేవలం 6.06 శాతానికి పడిపోయింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 2016 నాటికి 14.72 శాతం పేదరికం ఉండగా.. 2021 నాటికి 7.71 శాతానికి పడిపోయింది.
ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే పేదరికం 4.63 శాతం ఉంటే.. 2021 నాటికి 2.20 శాతానికి తగ్గింది. ఇది మేం చెప్పట్లేదండోయ్. కేంద్రప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ స్వయంగా ప్రకటించింది. ఇలా పేదరికం తగ్గడానికి జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలే కారణం అని తేల్చి చెబుతున్నాయి నివేదికలు. ఉన్న వాడి ఇంటికి కాదు.. పేదవాడి ఇంటికి ఇవ్వాలనేది జగన్ సంకల్పం.
అందుకే ఉచిత విద్య, వైద్యం, రైతులకు భరోసా.. బాలలకు పౌష్టికాహారం, అమ్మ ఒడి, గర్భిణులకు ఇచ్చే ప్రత్యేక ఆహారం, వృద్ధులకు పెన్షన్.. ఇలా అన్ని వర్గాల వారికి, అన్ని వయసుల వారి గురించి ఆలోచిస్తూ సంక్షేమ పథకాలతో పేదరికాన్ని దరిదాపుల్లోకి రానివ్వకుండా లక్ష్మణ రేఖ గీశారు జగన్.