టీవీ5 మూర్తి.. ఆ హీరోతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సినిమా..!

మీడియా రంగంలో
టీవీ5 మూర్తి
అంటే ఓ ఫైర్ బ్రాండ్. ఆయన అంటే తెలియని వారు ఉండరు. ముఖ్యంగా ఆయన కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్ గా నిలుస్తుంటారు.

ఇన్ని రోజులు న్యూస్ ఛానెల్ లో అలరించిన ఆయన.. ఇప్పుడు డైరెక్టర్ గా మారబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా ఓ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న కథతోనే.

ఆ హీరో ఎవరో కాదండోయ్
నారా రోహిత్
. ఆయన కమ్ బ్యాక్ సినిమాలు చేసి చాలా రోజులు అవుతోంది. ఆయన ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీగా మారబోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా నాలుగు ప్రాజెక్టులను లైన్ లో పెట్టేశాడు. అయితే తాజాగా 19వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

అధికారిక ప్రకటన..

ఇందులో ఆయన చేతిలో పేపర్ కాగితాలు పట్టుకున్నట్టు కనిపిస్తున్నాడు. ‘ఒక వ్యక్తి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడతాడు’ అనే కోట్ ను దీనికి క్యాప్షన్ గా ఇచ్చారు. చూస్తుంటే ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి డైరెక్టర్ గా టీవీ5 మూర్తి చేయనున్నారంట.

TV 5 Journalist Murthy About Become A Director

అతి త్వరలోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఏపీలో జరుగుతున్న రాజకీయాల నేపథ్యంలో ఈసినిమా ఉండబోతుందని అంటున్నారు. ఇక ఇది వచ్చే ఎలక్షన్ లోపు రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఇందులో ప్రస్తుత ఏపీ రాజకీయాలను ఏమైనా టచ్ చేస్తారా లేదా అని అంతా ఎదురు చూస్తున్నారు.

TV 5 Journalist Murthy About Become A Director : దర్శకుడిగా మారబోతున్న టీవీ5 మూర్తి.. ఆ హీరోతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సినిమా..!

YES9 TV