6hr4 shares
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓవైపు విపక్షాలను కూడగట్టేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు తనను సీఎం చేయాలంటూ ఓటర్లకు విజ్ఞప్తులు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మరో కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.
తన పార్టీని అధికారంలోకి తేవాలని, తనను సీఎం చేస్తే మార్పు చూపిస్తానని చెబుతున్న పవన్.. తన ప్రభుత్వం వస్తే ఏం చేస్తాననేది కూడా వెల్లడించారు.
ఇవాళ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కాకినాడలోకి ప్రవేశించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఉదయం స్ధానికంగా నగర ప్రముఖులతో పాటు మేథావులతో భేటీ అయ్యారు. వారితో తాజా పరిస్ధితులపై చర్చించారు. అనంతరం జనసేన ప్రభుత్వం ఏర్పాటు, అధికారం చేపట్టాక తన అజెండా ఎలా ఉంటుందన్న దానిపై వారికి వివరించారు. ఇందులో ముఖ్యంగా పవన్ నాలుగు అంశాల్ని ప్రస్తావించారు. వీటి ఆధారంగా తన పాలన ఉంటుందని వారికి పవన్ స్పష్టం చేశారు.