కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. కేంద్ర హోంశాఖ పెద్ద ఎత్తున నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో 1.30 లక్షల కానిస్టేబుల్ కొలువులను భర్తీ చేయనున్నారు.
ఏకంగా 1,29,929 కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ వెలువడింది.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి కేంద్ర హోంశాఖ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాల్ని పెద్దఎత్తున భర్తీ చేయనుంది. ఏకంగా 1,29,929 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇందులో 4667 పోస్టులు మహిళలకు రిజర్వ్ అయన్నాయి. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్ధులు ఇతర వివరాలకు crpf.gov.in.సందర్శించాల్సి ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి
ముందుగా crpf.gov.in.వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. రిక్రూట్‌మెంట్ ట్యాబ్ క్లిక్ చేయాలి. ఆ తరువాత సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ లింక్ ఓపెన్ చేయాలి. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేయాలి. అందులో ఉండే సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తు నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు ఫీజు చెల్లించి..సబ్మిట్ చేయాలి.
సీఆర్పీఎఫ్ రిక్రూట్‌మెంట్ 2023 వయస్సు, అర్హతలు
సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 23 సంవత్సరాల మధ్య ఉండాలి. 1996 ఆగస్టు 2 లోపు, 2002 ఆగస్టు 1 తరువాత పుట్టి ఉండకూడదు. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్ధులు కనీసం పదవ తరగతి లేదా మెట్రిక్యులేషన్ పాస్ అయుండాలి. అగ్నివీర్‌లకు సీఐఎస్ఎఫ్ ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ ఉంటుంది. అగ్నివీర్ అభ్యర్ధులకు గరిష్ట వయోపరిమితిలో 5 ఏళ్లు మినహాయింపు ఉంటుంది. 1.30 లక్షల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడం చాలాకాలం తరువాత ఇదే తొలిసారి.