మందార పువ్వును పూర్వీకులు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వినియోగించేవారు. ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఈ పువ్వుకు చాల ప్రాధాన్యత ఉంది.
ఈ పువ్వు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. అయితే ప్రస్తుతం ఈ పువ్వుకు మార్కెట్‌లో చాలా డిమాండ్ పెరిగి.. దీనితో తయారు చేసి చాలా రకాల ప్రోడక్ట్స్ మార్కెట్‌లో విచ్చలవిడిగా లభిస్తున్నాయి. ఇందులో చర్మానికి సంబంధించినవి మరికొన్ని, అయితే మరికొన్ని జుట్టుకు సంబంధించినవి లభిస్తున్నాయి. ఈ పువ్వుతో తయారు చేసిన డికాషన్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మందార పువ్వు ప్రయోజనాలు:
మందార పువ్వు డికాషన్ ప్రతి రోజూ తాగడం వల్ల అధిక రక్తపోటు సమస్యల కూడా సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా రక్తం మెరుగుపడి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గుండెకు చాలా మంచిది:
ప్రస్తుతం చాలా మందిలో గుండెపోటు సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ మందార పువ్వు డికాషన్ తాగడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు. అంతేకాకుండా గుండె పోటు సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది:
విచ్చలవిడిగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల చాలా మందిలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మందారపు పువ్వుతో తయారు చేసిన టీని తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
జీర్ణ క్రియను పెంచుతుంది:
చాలా మందిలో ప్రస్తుతం జీర్ణ క్రియ సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మందారపు పువ్వు టీలో తేనెను కలుపుకుని తీసుకుంటే బరువు తగ్గడమేకాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
