Latest Posts

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ మొట్టమొదటగా ‘దత్త పుత్రుడు’

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని మొట్టమొదటగా ‘దత్త పుత్రుడు’ అని పేర్కొన్నది స్వయానా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.!

అయినాగానీ, టీడీపీతో జనసేన అధినేత ఎందుకు సఖ్యతగా వుండాలనుకుంటున్నట్టు.? వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని జనసేన అధినేత ఎందుకు చెబుతున్నట్లు.?

వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు.. అన్నది వేరే చర్చ.! ప్రజా సమస్యలపై విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలన్నది ఇంకో చర్చ. కానీ, ఓ వైపు వైసీపీ అనుకూల మీడియా ఇంకో వైపు టీడీపీ అనుకూల మీడియా.. ఈ రెండూ కలిసి, జనసేన అధినేత మీద ‘ప్యాకేజీ’ అనే ముద్రతోపాటు, ‘కుల’ ముద్ర కూడా వేస్తున్నాయి.

టీడీపీతో జనసేన అధినేత కలిస్తే.. అది గొప్ప విషయం.! ఒకవేళ టీడీపీతో జనసేన కలవకపోతే మాత్రం.. అది చారిత్రక తప్పిదం.! ‘వుంటే మాతోనే వుండాలి. అందులోనూ పై చేయి మాదే అవ్వాలి..’ అన్నట్లు టీడీపీ, టీడీపీ అను’కుల’ మీడియా వ్యవహరిస్తోంది.

తమ దార్లోకి రాలేదనిపిస్తే చాలు, వికృత విశ్లేషణలతో విపరీతమైన పైత్యాన్ని, విషాన్నీ చిమ్మటానికి టీడీపీ అను’కుల’ మీడియా ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది. జనసేన ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పచ్చ మీడియా పైత్యపు విశ్లేషణలు తారాస్థాయికి చేరాయి. వైసీపీ అను’కుల’ మీడియా సంగతి సరే సరి.!

వైసీపీని దించేస్తాం.. అని జనసేనాని అంటున్నారు గనుక, వైసీపీ నుంచి ఆ స్థాయి పైత్యం మామూలే. కానీ, టీడీపీకి ఏమయ్యింది.? టీడీపీ అను’కుల’ మీడియా ఎందుకు గింజుకుంటోంది.? ఇదేమీ మిలియన్ డాలర్ల ప్రశ్న కాదు. అయితే వైసీపీ, లేదంటే టీడీపీ.. ఇవి తప్ప ఇంకో పార్టీ రాజకీయాల్లో వుండకూడదన్నది అటు టీడీపీ అను’కుల’ మీడియా, ఇటు వైసీపీ అను’కుల’ మీడియా ఉద్దేశ్యం.

ఈ క్రమంలో కుహనా మేధావుల్ని కొందర్ని తీసుకొచ్చి, పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించి చూపేందుకు ఆయా మీడియా సంస్థలు పడే పాట్లు వర్ణనాతీతం. నిన్న మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ అత్యంత సమర్థవంతమైన వ్యూహంతో ముందుకు వెళుతున్నారని చెబుతూ వచ్చిన టీడీపీ అను’కుల’ మీడియా, టీడీపీతో పవన్ కళ్యాణ్ కలవరేమో.. అన్న అనుమానం రావడంతో, పూర్తిగా ప్లేటు ఫిరాయించేసింది.

అనుమానంతోనే ఇలా వుంటే, రేప్పొద్దున్న టీడీపీతో కాకుండా బీజేపీతోనే వెళతామని పవన్ ఖరాఖండీగా చెప్పేస్తేనో.! ఏముంది.? నిస్సిగ్గుగా ‘జెండా పీకేద్దాం’ అని ప్రజారాజ్యం విషయంలో చేసిన దుష్ప్రచారమే ఇప్పుడూ టీడీపీ అను’కుల’ మీడియా చేస్తుంది.

ఒక్కటి మాత్రం నిజం. టీడీపీతో కలిసి వెళ్ళడాన్ని మెజార్టీ జనసైనికులు కూడా సమర్థించే పరిస్థితి లేదు. కానీ, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు.. అన్న కోణంలో.. రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం.. జనసేన అధినేత టీడీపీతో కలిసి వెళ్ళడం.. అన్న ఆలోచన చేస్తారేమో.! అలా చేసినా, టీడీపీదే పై చేయి అవ్వాలన్నది టీడీపీ అను’కుల’ మీడియా పైత్యం. ఇంకెందుకు మీడియా సంస్థలు నడపడం, నేరుగా రాజకీయాల్లోకి వచ్చేయొచ్చు కదా.?

YES9 TV