​విజయవాడలో మాలా కార్పొరేషన్ చైర్మన్‌ను కలిసిన ఆలూరు జనసేన నాయకులు ఛత్రపతి..

​విజయవాడలో మాలా కార్పొరేషన్ చైర్మన్‌ను కలిసిన ఆలూరు జనసేన నాయకులు ఛత్రపతి

ఈరోజు విజయవాడలో జనసేన పార్టీ మాలా కార్పొరేషన్ చైర్మన్ శ్రీ విజయ్ కుమార్ గారిని ఆలూరు జనసేన మండల నాయకులు శ్రీ ఛత్రపతి గారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
​ఈ భేటీ సందర్భంగా ఆలూరు మండలంలో జనసేన పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. పార్టీని క్షేత్రస్థాయిలోకి మరింత బలంగా ఎలా తీసుకెళ్లాలి, ప్రజా సమస్యల పరిష్కారంలో జనసైనికులు ఏ విధంగా ముందుండాలి అనే విషయాలపై చైర్మన్ శ్రీ విజయ్ కుమార్ గారు పలు సూచనలు చేశారు.
​రాబోయే రోజుల్లో పార్టీ నిలకడకు, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు చిప్పగిరి చిరు, చంద్రమౌళి , పాల్గొన్నారు.

Posted Under AP
Editor