శ్రీ కృష్ణ దేవాలయం నిర్మాణం కు 1,01,116 లు. ఒక లక్ష వెయ్యి నూట పదహారు రూపాయలు విరాళం అందించిన కీ. శే. టీడీపి మాజీ ఎంపిటిసి చన్నంపల్లి తిమ్మప్ప యాదవ్ కుటుంబ సభ్యులు….
ఆలూరు..
ఆలూరు మండలం మొలగవల్లి గ్రామం లో కొలువైన శ్రీ కృష్ణ భగవంతుడు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద బావి దగ్గర ఒక ఎకరం విస్తీర్ణం లో నూతనంగా కోటి రూపాయలకు పైగా వ్యయంతో నిర్మిస్తున్న దేవాలయ నిర్మాణం కు గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి కీ. శే. చన్నంపల్లి తిమ్మప్ప యాదవ్ కుమారులు ఒక లక్ష వెయ్యి వంద పదహారు రూపాయలు విరాళంగా దేవాలయం కమిటీ కి అందించారు. అలాగే అర్చకులు ప్రభుస్వామి ఆధ్వర్యంలో ఎంపిటిసి సునంద పటేల్ యాదవ్ దంపతులు, గోపాల్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు, మహిళలు స్వామి వారికి అటుకులు, నెయ్యి, వెన్న లను ప్రసాదంగా అందించారు. అలాగే భక్తులకు అన్నదానం నిర్వహించారు.
సాయంత్రం గ్రామ పురవీధుల గుండా శ్రీ కృష్ణ రథోత్సవం ఊరేగింపు చేశారు. రతోత్సవం ముందు బొమ్మలతో నృత్యాలు చేసినకళాకారులు.అంతకుముందు ఉట్టి కొట్టడానికి యువకులు పోటీ పడ్డారు. కార్యక్రమంలో గ్రామస్థులు రంగస్వామి, రాం నాథ్ యాదవ్, ఈరప్ప, నాగప్ప, గురుస్వామి, మాణిక్య, మల్లయ్య, శీనప్ప, రామాంజినేయులు, మోహన్ రాజ్, ఈరన్న, కృష్ణ,జ్ఞానీ,నరసింహులు, సుమన్, అంజినయ్య, బజారి, నాగేష్, బాబు, చంద్ర, సేకన్న లు పాల్గొన్నారు.
