శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవస్థానం – కసాపురం, అనంతపురం జిల్లా.
04 .09. 2026 శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్బంగా ఉదయం 10 :00 గంటల నుండి దేవస్థానం యాగశాల వద్ద దేవస్థాన ఉప కమిషనరు మరియు కార్యనిర్వహణధికారి శ్రీ మాన్ మేడేపల్లి విజయరాజు గారు, దేవస్థాన అనువంశిక ధర్మకర్త
శ్రీమతి కే. సుగుణమ్మ గార్ల ఆధ్వర్యంలో దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ కే రాఘవాచార్యులు గారి నేతృత్వంలో దేవస్థానం వేద పండితులు అర్చక పరివారముచే “సామూహిక వరలక్ష్మీ వ్రతం” నిర్వహించబడింది.
వ్రత రుసుము రూ2000/- లు చెల్లించిన భక్తులకు మహిళలకు, పూజా సామాగ్రి తో పాటు, పట్టుచీర, లడ్డు ప్రసాదము, స్వామివారి శేష వస్త్రము, అందజేయుచు
శ్రీ స్వామివారి ప్రత్యేక దర్శనం
మరియు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
