వారపు సంతలో ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా పోలీసుల పర్యవేక్షణ…

వారపు సంతలో ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా పోలీసుల పర్యవేక్షణ…
ముదిగుబ్బ మండల కేంద్రంలోని సొసైటీ వద్ద నిర్వహించే వారపు సంతలో దుకాణాలు, తోపుడు బండ్లను రహదారిపై ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. దీంతో అర్బన్ సీఐ రామసుబ్బయ్య ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది గణేష్, బాషా సంతలో మైక్ ద్వారా వ్యాపారులకు అవగాహన కల్పించారు. రహదారిపై ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని, పార్కింగ్ ప్రదేశాల్లో తోపుడు బండ్లు పెట్టకూడదని సూచించారు. ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా సహకరించాలని కోరారు.

Posted Under AP
Editor