Latest Posts

గంజహళ్లి గ్రామా అభివృద్ధిని కాదు అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకుంటాం :గోనెగండ్ల వైసీపీ

 

గోనెగండ్ల YES9TV TELUGU న్యూస్ :- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం మండలకేంద్రమైన గోనెగండ్లలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నీయోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆదేశాఖమేరకు మండలనాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చెర్మెన్ మన్సూర్, మహేష్ రెడ్డి, తోలు రాముడు మల్లేష్ మాట్లాడుతూ గత వారం క్రితం గంజహళ్లి గ్రామ చెరువును పరిశీలించిన రాజీవ్ రెడ్డి, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చెరువు మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని మాట్లాడిన మాటలకూ టీడీపీ నాయకులు ఏమి మాట్లాడాలో తెలియక అనవసరంగా రాజీవ్ రెడ్డిని విమర్శిస్తున్నారని.కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినా ప్రజలకు చెప్పుకోదగ్గ మేలు జరగలేదని విమర్శించారు.రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు సూపర్ సిక్స్ హామీల పేరుతో మోసపోయారని, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్తామని.ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, 2029 ఎన్నికల్లో ప్రజలు మరోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించి అధికారంలోకి తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గంజహళ్లి గ్రామ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు

Posted Under AP
Editor