“పేదల సేవలో” కార్యక్రమంలో భాగంగా ఈరోజు కదిరి పట్టణం మున్సిపల్ 31 వ వార్డు నందు “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాను. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి నేరుగా చేరాలన్న స్పష్టమైన లక్ష్యంతో, లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేశాను. పేదల జీవన భద్రతను బలోపేతం చేయడం, వారికి సామాజిక గౌరవం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు.
అనంతరం
ఉచిత విద్యుత్ పథకం – నేతన్నల ఆర్థిక భరోసాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీటక ముందడుగు
చేనేత మరియు పవర్లూమ్ రంగాలకు బలమైన మద్దతు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “ఉచిత విద్యుత్ పథకం”ను అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా చేనేత కార్మిక కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు, పవర్లూమ్ యూనిట్లకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబడుతుంది. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చిన ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాది నేతన్నల కుటుంబాలకు ప్రత్యక్ష ఆర్ధిక ప్రయోజనం కలగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 93,000 చేనేత కార్మిక కుటుంబాలు మరియు 11,488 పవర్లూమ్ యూనిట్లు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.150 కోట్ల బడ్జెట్ను కేటాయించడం ద్వారా నేతన్నల సంక్షేమానికి, వస్త్రరంగ అభివృద్ధికి తన కట్టుబాటును కార్యరూపంలో చూపిస్తోంది. ఇది కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాకుండా, నేతన్నల జీవనోపాధిని రక్షించడానికి, వృత్తికి బలాన్నివ్వడానికి, రంగానికి నూతన ఉత్సాహాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకున్న దూరదృష్టి కలిగిన చర్య.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతన్నల శ్రమను గౌరవిస్తూ, వారి కుటుంబాల సంక్షేమాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఉచిత విద్యుత్ పథకం ద్వారా చేనేతకు వెలుగు, పవర్లూమ్కు బలం, నేతన్నల జీవితాలకు ఆర్థిక భరోసా లభించనుంది. నేతన్నల అభ్యున్నతి, గ్రామీణ ఉపాధి బలోపేతం, సంప్రదాయ వృత్తుల పరిరక్షణ మరియు వస్త్రరంగ ప్రోత్సాహం అనే లక్ష్యాల దిశగా ఈ పథకం ఒక ముఖ్యమైన సంక్షేమ అడుగుగా నిలవనుంది.
అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
