అనంతపురం జిల్లా,రాయదుర్గం.
• మార్కెట్ కమిటీ చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
• మార్కెట్ యార్డ్‌లో రైతులకు మజ్జిగ, నీరు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలవ
రాయదుర్గం పట్టణలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ లో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రైతులకు మజ్జిగ మరియు చల్లని తాగునీటిని పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ యు.హనుమంత రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు.
కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాలవ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి, మార్కెట్‌కు వచ్చిన రైతులకు స్వయంగా మజ్జిగ, నీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎండ తీవ్రతలో రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం మార్కెట్ యార్డ్‌లో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ టెంకశాల హనుమంతు,మార్కెట్ యార్డ్ కార్యదర్శి శ్రీనివాసులు, సూపర్వైజర్ రమేష్, జేఎంఎస్ ఓబులేష్, సిబ్బంది ఈశ్వర్, సోమలాపురం సొసైటీ చైర్మన్ కురుబ శంకర్ తదితరులు పాల్గొన్నారు. రైతులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
