రక్తదానం ప్రాణదానం తో సమానం….
రక్తదాన శిబిరం ఏర్పాటు స్ఫూర్తిదాయకం…
జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్
రాయదుర్గం, జూన్ 12:
రక్తదానం చేయడం ద్వారా ఒకప్రాణాన్నికాపాడినవారమవుతారని రక్తదానం ప్రాణ దానంతో సమానమని జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ తెలిపారు.
శుక్రవారంఉదయంరాయదుర్గం నియోజకవర్గం లోని ఆవులదట్ల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లాకలెక్టర్ కార్యక్రమాన్ని ముఖ్యంగా అతిథిగా విచ్చేసి మెగా బ్లడ్ క్యాంప్ ను సందర్శించారు. ఈసందర్భంగానిర్వాహకులనుఅభినందిస్తూభవిష్యత్తులో కూడా స్ఫూర్తిదాయకంగా ప్రజలకుఉపయోగపడేవిధంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మానవతా దృక్పథంతో నిర్వహించినఈకార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ
రక్త దాతలు రక్తదానం చేసి సాటి మనిషి ప్రాణాలు కాపాడడంలో మించిన దానం మరొకటి లేదని రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడంలో ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దని సూచించారు. అన్ని వర్గాల ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తం అందక ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతోఈరోజుస్వచ్ఛందంగా రక్తదానం చేయడం ఎంతో స్ఫూర్తిదాయకం ఆదర్శనీయ మైందన్నారు. ముఖ్యంగా పేదలకుఎంతోఉపయోగకరంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా ప్రమాద సమయాల్లో, గర్భిణీ స్త్రీల ప్రసవాలకు ఇతర ముఖ్య సమయాలలో రక్తదానం చేయడం వల్ల ఎలాంటి బలహీనత రాదని అంతేగాక శరీరంలో కొత్త రక్తం తయారై ఆరోగ్యం కూడా బాగుంటుందని ప్రతి ఒక్కరు భయాన్ని విడి విరివిగా రక్త దానం చేయడానికి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కోరారు. తాను కూడా కాలేజీలో విద్యార్థి దశలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో రక్తదానం చేశానని జిల్లా కలెక్టర్ గుర్తు చేశారు. జిల్లాలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న రోగులకు కూడా రక్తదానం లాంటిసేవలు ఎంతో ఉపయోగంగాఉంటుందన్నారు. సమాజ సేవలో భాగంగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్తర కార్యక్రమం ఆపదలో ఉన్న వారికి ఎంతగానోదోహదపడుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
రక్తదాతలు ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ రెడ్ క్రాస్ సొసైటీ లేదా ప్రైవేట్ సంస్థలలో స్వచ్ఛందంగా రక్తదానం చేయాల్సిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా .ఈ.బీ.దేవి, మెడికల్ ఆఫీసర్ డా. రాజేంద్రప్రసాద్ , డిప్యూటీ డెమో లక్ష్మీనారాయణ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రవీణ్, అయూఫ్ , తాలూకా అధ్యక్షుడు కమలాక్షుడు తాలూకా జనరల్ సెక్రెటరీ గురు ప్రసాద్ ,ప్రచార కార్యదర్శి ఆవుల మనోహర్ కౌన్సిల్ మెంబర్ కె.పి. కుమార్ యూనియన్ నాయకులు, జర్నలిస్టులు, ప్రజలు రక్తదాతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
