శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం యోగాంధ్ర 2026 శిక్షణా కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నల్లమాడ నందు ఏర్పాటు చేసి మాస్టర్స్ ట్రైనర్ల ద్వారా ట్రైనర్లకు యోగా గురించి శిక్షణ ఇవ్వడం జరిగినది. ప్రతి ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి 2014లో దీన్ని ప్రకటించింది. శరీరం, మనసు, ఆత్మ సమతుల్యత కోసం యోగా సాధనను ప్రోత్సహించడం. యోగాను ప్రతిరోజు చేయడం వలన మానసిక ప్రశాంతతతో పాటు, శారీరక ప్రశాంతత కూడా లభిస్తుందని యోగా చేయడం వల్ల మన జీవనశైలిలో ఎన్నో మార్పులు వస్తాయని, ఈ యోగా కార్యక్రమాన్ని నల్లమాడ మండలం నందుగల ప్రతి స్వర్ణ గ్రామంనందు ప్రతిరోజు నిర్వహించాలని స్వర్ణ గ్రామ తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డిఓ సువర్ణ, ఎంపీడీవో అంజినప్ప, తహసిల్దార్ మనోజ్ కుమార్, డిప్యూటీ ఎంపీడీవో, స్థానిక ప్రజాప్రతినిధులకు, స్థానిక నాయకులకు, మండల అధికారులు,రెవెన్యూ & జి రామ్ జి సిబ్బంది, వెలుగు సిబ్బంది,పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ & మండలంలో గల స్వర్ణ గ్రామం సచివాలయ ఉద్యోగులందరు పాల్గొనడం జరిగినది
నల్లమాడలో ‘యోగాంధ్ర 2026’ శిక్షణా కార్యక్రమం: ప్రతి స్వర్ణ గ్రామంలోనూ రోజువారీ యోగా సాధనకు పిలుపు!
