తాడిమర్రి(yes9tv )ఎస్ఐఆర్పై బూత్ లెవల్ ఏజెంట్లకు అవగాహన సదస్సు
తాడిమర్రి, జూన్ 12:
ధర్మవరం రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) రాజశ్రీ ఆదేశాల మేరకు, తాడిమర్రి తహసీల్దార్ రెడ్డి లక్ష్మి ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ (Special Intensive Revision) కార్యక్రమానికి సంబంధించి బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏలు) కోసం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ రెడ్డి లక్ష్మి మాట్లాడుతూ, ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియలో బీఎల్ఏల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ఎస్ఐఆర్ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదు కావడం, అర్హత లేని పేర్లను తొలగించడం, వివరాల్లో మార్పులు చేర్పులు చేయడం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
అలాగే ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియలో అనుసరించాల్సిన విధివిధానాలు, అవసరమైన పత్రాలు, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల గురించి వివరించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు బీఎల్ఏలు అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ అవగాహన సదస్సులో పాల్గొన్న బూత్ లెవల్ ఏజెంట్లు తమ సందేహాలను వ్యక్తం చేయగా, వాటికి అధికారులు తగిన వివరణలు అందించారు. కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది, రెవెన్యూ శాఖ అధికారులు మరియు బీఎల్ఏలు పాల్గొన్నారు
ఎస్ఐఆర్పై బూత్ లెవల్ ఏజెంట్లకు అవగాహన సదస్సు…
