సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దాలి..
– : అన్ని సమస్యలను వేగంగా పరిష్కరించాలి..
– : వరుసగా నాల్గవ శుక్రవారం రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు కార్యక్రమం..
– : పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..
అనంతపురం, జూన్ 12 :
– రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామంలో వరుసగా నాల్గవ శుక్రవారం ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు, రైతుల నుంచి సమస్యలను తెలుసుకుని వారి నుంచి వినతి పత్రాలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు.
– ఈ కార్యక్రమంలో ఇందుకుముందు మూడువారాలపాటు 87 అర్జీలను ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ స్వీకరించగా, అందులో 67 అర్జీలను పరిష్కరించడం జరిగింది. మిగిలిన 20 అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు నాల్గవ శుక్రవారం 48 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. అనంతరం మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందులో ఏ రకమైన అర్జీలు వచ్చాయి అనేది అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలను వేగంగా నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
– ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, వరుసగా నాలుగు వారాల పాటు ఇక్కడికి రావడం జరిగిందన్నారు. గత మూడు వారాలుగా 87 అర్జీలను ప్రజల నుంచి తీసుకోవడం జరిగిందని, వాటిలో పరిష్కరించగలిగినవి పరిష్కరిస్తూ.. పరిష్కరించలేనివి ఎందుకు పరిష్కరించలేము అనేది తెలియజేస్తూ ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో స్వయంగా నాలుగైదు అర్జీలను పరిష్కారం చూపించామన్నారు. ఈరోజు 48 అర్జీలు రావడం జరిగిందని, వాటిని కూడా త్వరితగతిన పరిష్కారం చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గురువారం తహసిల్దార్లు వారి మండలంలో ఒక గ్రామాన్ని విజిట్ చేయడానికి పెట్టుకోవడం జరిగిందని, జిల్లాలో 32 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. తహసీల్దార్లకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి అనేది స్వయంగా క్షేత్రస్థాయిలో చూడడానికి ఈ కార్యక్రమంలో అవకాశం ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా నెలకు నాలుగు వారాలు పాటు ప్రతివారం ఒకే గ్రామానికి వెళ్లడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఉడేగోళం గ్రామంలో నాలుగు వారాల పాటు నిర్వహించడం జరిగిందన్నారు. రాబోయే నెలలో ఉరవకొండ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
– ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్డీవో వసంత బాబు, తహసీల్దార్ సూర్యప్రతాప్, ఆయా శాఖల అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
