ఛత్రగుడి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

కర్నూలు జిల్లా హోలహర్వి మండలం
హోలహర్వి :
ఛత్రగుడి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
అతి వేగంతో ప్రయాణిస్తున్న రెండు లారీలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఒక లారీ ఆధోని వైపు వెళ్తుండగా, మరో లారీ బళ్లారి వైపు నుండి వస్తోంది. ఛత్రగుడి సమీపంలోకి రాగానే ఈ రెండు వాహనాలు ఒకదానికొకటి వేగంగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు రెండు లారీల ముందుభాగాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి.
ఈ ప్రమాదంలో ఒక లారీ డ్రైవర్ కాలుకు తీవ్ర గాయమై క్యాబిన్‌లోనే చిక్కుకుపోగా, పోలీసులు మరియు స్థానికులు జేసీబీ సహాయంతో అతనిని బయటకు తీశారు.
మరొక డ్రైవర్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి.
క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రోడ్డుకు అడ్డంగా లారీలు నిలిచిపోవడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్ల సహాయంతో వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Posted Under AP
Editor