రాత్రి కురిసిన భారీ వర్షానికి వంక ప్రవాహంలో కొట్టుకుపోయి మహిళ మృతి.
మడకశిర పట్టణ పరిధిలోని బేగార్లపల్లి క్రాస్ వద్ద చోటుచేసుకున్న ఘోర ప్రమాదం.
బైక్‌పై వెళ్తుండగా వంక నీటి ఉధృతికి అదుపుతప్పి నీటిలో పడిపోయిన అక్కాతమ్ముళ్లు.
ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డ తమ్ముడు దివాకర్.. ప్రవాహంలో కొట్టుకుపోయిన గీతమ్మ (40).
ఘటనా స్థలానికి చేరుకుని రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, ఫైర్ సిబ్బంది.
ఉదయం వంక దిబ్బల్లో మట్టిలో పేరుకుపోయిన గీతమ్మ మృతదేహం లభ్యం.
గీతమ్మ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నూరవుతున్న కుటుంబ సభ్యులు.
ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి.
