అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం.
తాగునీటికి ఇబ్బంది అని అడగ్గానే బోరు వేయించిన ఎమ్మెల్యే అమిలినేని
కొబ్బరికాయ కొట్టి బోరును ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని
సమ్మర్ యాక్షన్ టీమ్ ఏర్పాటు
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీలో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని కాలనీ వాసులు, మహిళలు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారి దృష్టికి తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే నేడు ఉదయం బోరు వెయడానికి బోరు వద్ద కొబ్బరికాయ కొట్టి లాంచంగా ప్రారంభించగా మధ్యాహ్ననికి నీళ్లు పడటంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు..ఎమ్మెల్యే అమిలినేని గారు సమ్మర్ యాక్షన్ టీమ్ ను ఏర్పాటు చేసి ఎక్కడ సమస్య ఉందొ గుర్తించి వెంటనే అక్కడ అవసరం మేరకు బోరు వేయించడం లేదా మరో ప్రత్యామ్నాయం చేస్తున్నారు.. తాగునీటి సమస్య ఉందని చెప్పిన వెంటనే స్పందించి బోరు వేయించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారికి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు..
