ముదిగుబ్బ yes9TV
ముదిగుబ్బ ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ పరిటాల శ్రీరామ్ గారి ఆదేశాల మేరకు ముదిగుబ్బ పట్టణంలో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం”కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా 59, 61, 62, 63, 64 బూత్‌ల పరిధిలోని ప్రతి ఇంటినీ సందర్శించి ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
అలాగే ప్రతి ఇంటి వద్ద ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వారి సమస్యలను పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ తుమ్మల మనోహర్ , బూత్ ఇంచార్జ్ లు గోనుగుట్ల సూర్యనారాయణ, చలపతి, మల్లెల నారాయణ స్వామి, పొడరాళ్లపల్లి కర్ణ, ఫిరోజ్, జయ, విష్ణు, గురు,నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు…
ముదిగుబ్బ పట్టణంలో రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమం…
