Latest Posts

అమరావతికి చట్టబద్ధత కల్పించడం చారిత్రక మైలురాయి: లత్తవరంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

అనంతపురం జిల్లా, ఉరవకొండ.

రాజధాని అమరావతికి పార్లమెంట్ లో చట్టం రూపంలో తీసుకురావడం అనేది ఒక మైలురాయి..

– : రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్

– : ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..

– ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి వారికి స్వయంగా పెన్షన్లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా వారితో పలు సమస్యల గురించి అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అంతకుముందు గ్రామంలోని రామాలయంలో మంత్రి పూజలు చేశారు. లత్తవరం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి వారితో కలిసి భోజనం మంత్రి భోజనం చేశారు.

– ఈ సందర్భంగా పాత్రికేయులతో మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ కూటమికి వేసిన ఒక్క ఓటు వల్ల రాష్ట్రానికి వందల లాభాలు చేకూరిందని, ప్రతి కుటుంబానికి సంక్షేమం అందిస్తోంది అనడానికి అమరావతి రాజధాని మరో మైలు రాయి అన్నారు. ఒక్క ఓటుతో అమరావతికి వేలకోట్ల సహాయాన్ని కేంద్రం అందించిందని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిందని, విశాఖ ఉక్కును కాపాడిందని, రైల్వే లైనులకు 70 వేల కోట్ల పెట్టుబడి ఇచ్చిందని, 70 వేల కోట్లతో మరో జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించిందని, గూగుల్ ప్రాజెక్ట్ లు రావడానికి, ప్రజలు వేసిన ఒక ఓటుకి కూటమి ప్రభుత్వం న్యాయం చేసే దిశగా ముందుకు సాగుతోందన్నారు. మరో మైలురాయి అమరావతిని చట్టబద్ధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా కేంద్రంలో, పార్లమెంట్ లో చట్టం రూపంలో తీసుకురావడం అనేది ప్రజలు వేసిన ఓటుకి మరో ముందడుగు, మరొక నమ్మకాన్ని కలిగించే దిశగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంగా అందరూ గుర్తించాలని కోరుకుంటున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి అభివృద్ధి మీద దృష్టి పెట్టి శాశ్వతంగా ఉండేలా, అమరావతి అంటే అది ఒక రాజధాని కాదని, రాష్ట్రంలో చదువుకుంటున్న ప్రతి యువకుడికి ఒక ఉద్యోగ ఉపాధి కల్పించే అవకాశం అని, ప్రతి ఒక్కరికి ఆదాయాన్ని జనరేట్ చేసేటువంటి స్థానం కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ఈరోజు పార్లమెంట్లో అమరావతి రాజధాని అని చట్టం జరగబోతున్నందుకు ప్రతి ఆంధ్రుడు గర్వపడాలన్నారు. దానికి కృషి చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఆంధ్రుడు రుణపడి ఉండాలని కోరుకుంటున్నామన్నారు. మరొకసారి మోసపోకుండా ఉండేందుకు చట్టం రూపంలో తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. అలాగే గ్రామంలో పలు గోకులం షెడ్లను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor