Latest Posts

చుక్కల భూముల నుండి రైతులకు విముక్తి: గోపేపల్లి రైతులకు ఎన్వోసీలు అందజేసిన మంత్రి అనగాని, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

చుక్కల భూముల రైతులకు శాశ్వత విముక్తి

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగానీ సత్యప్రసాద్ ,జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి.

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం గోపేపల్లి గ్రామం సంబంధిత రైతులకు ఎన్వోసీ పత్రాలను అందజేసిన మంత్రి అనగానీఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, కలెక్టర్ శ్యాంప్రసాద్.

తక్షణ పరిష్కారం చూపిన మంత్రి అనగాని ,ఎమ్మెల్యే పల్లె సింధూర ,జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ,జేసి ,ఆర్డీఓ కు ప్రత్యేక అభినందనలు తెలిపిన గోపేపల్లి గ్రామ రైతులు
నల్లమాడ మండలం గోపేపల్లి గ్రామంలో సుమారు 80% భూములు చుక్కల భూములు కింద రికార్డుల్లో పడడంతో ఈ విషయాన్ని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగానీ ప్రసాద్ జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. సత్య సాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్కు విచ్చేసిన రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ దృష్టికి ఎమ్మెల్యే పల్లి సింధూర రెడ్డి సంబంధిత రైతుల సమస్యలు తీసుకొచ్చారు. ఇటీవల జరిగిన రీ సర్వే కార్యక్రమము తరువాత సదరు పట్టదారులకు certified 1B లు కానీ, పట్టాదారు పాసుపుస్తకములు కానీ రాకపోవడం వల్ల రైతులకు బ్యాంక్ రెన్యువల్ కు ,ఆ ఆస్తుల క్రయ విక్రయాలకు చుక్కల భూములు అడ్డంగా ఏర్పడాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇదే విషయాన్ని ఆ గ్రామానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి వెళ్ళినప్పుడు గ్రామ రైతులు మండల తహసీల్దార్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.
​గోపేపల్లి పంచాయతీలో చుక్కల భూములు కింద పడిన భూములన్నిటికీ తక్షణం పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సూచన మేరకు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశాల మేరకు నల్లమడ మండల తహసీల్దార్ మనోజ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకొని సుమారు 120 మంది రైతులకు 305 .68 ఎకరాల భూమిని చుక్కల భూమి నుంచి తొలగించి పట్టా భూమిగా మార్చి రైతులకు ఎన్వోసీ పత్రాలను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి సత్య ప్రసాద్ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆర్డిఓ సువర్ణ చేతులమీదుగా రైతులకు అందజేశారు. రైతులకు చుక్కల భూమి నుంచి శాశ్వత విముక్తి కల్పించిన సత్యసాయి జిల్లా యంత్రాంగానికి మంత్రి సత్యప్రసాద్ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,ప్రత్యేక అభినందనలు తెలిపారు. రైతులకు శాశ్వత పరిష్కారం చూపిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డికి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కి, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ , ఆర్డీవో సువర్ణ , మండల తహసిల్దార్ మనోజ్ కుమార్ ,మండల రెవిన్యూ అధికారులకు నల్లమడ మండలం గోపేపల్లి పంచాయతీకి చెందిన రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Posted Under AP
Editor