అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం.
మన రాజధాని అమరావతిగా పార్లమెంట్ లో ఆమోదం పొందడం చాలా సంతోషకరం. ఎమ్మెల్యే అమిలినేని
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కలగానే నిలిచిపోకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో నేడు పార్లమెంట్ లో అమరావతి రాజధానిగా బిల్ ప్రవేశపెట్టడం అది ఆమోదం కావడంతో నేడు చాలా సంతోషకరమైన రోజు..5 కోట్ల ఆంధ్రుల కల నేడు నెరవేరింది.. ఎన్నో సంవత్సరాలనుండి మనం ఎదురుచూస్తున్నాం రాజధాని కోసం నేడు చట్టబద్దత కల్పించడం చాలా సంతోషకరం..వైసీపీ నాయకులు, పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసి వారి క్రూరమైన బుద్దిని చూపుకున్నారు..అమరావతికి వ్యతిరేకంగా ఉన్నారు అనేదానికి నిదర్శనం ప్రజలారా గమనించండి..కూటమి ప్రభుత్వమే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కాపాడే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు..ఇంతటి సంతోషమైన రోజునే సంక్రాంతి, ఉగాది, రంజాన్ పండుగలను ఖచ్చితంగా జరుపుకోవాలని కోరుకుంటున్నా..రాజధాని అమరావతి చట్టభద్ధమైనందుకు ఆంధ్ర ప్రజలకు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నా…
