హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్ర కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

హైదరాబాద్‌ పేలుళ్లకు కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్‌, సమీర్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. ఆరుగురు వ్యక్తులు ఇన్‌స్టా గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్లు గుర్తించారు. సిరాజ్‌, సమీర్‌తోపాటు టీమ్‌లో కర్నాటక, మహారాష్ట్ర యువకులు కూడా ఈ గ్రూప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో 3 రోజులపాటు కలిసి ఉన్న ఆరుగురు గ్యాంగ్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఐసిస్‌ హ్యాండ్లర్‌ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలు చేయడంపై మీటింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది. టిఫిన్‌ బాక్స్‌ బాంబులు తయారు చేయాలని ఇద్దరికి ఆదేశం ఇవ్వగా.. మిగతా నలుగురికి బాంబ్‌లు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అమేజాన్‌లో టిఫిన్‌బాక్స్‌లు, వైర్లు, రిమోట్‌ సెల్స్‌ సిరాజ్‌..ఆర్డర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న విజయనగరంలో సిరాజ్, హైదరాబాద్‌లో సమీర్‌‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం కోర్టు ఇద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించింది. అరెస్టు సమయంలో సిరాజ్ దగ్గర భారీగా పేలుడు పదార్థాలు గుర్తించారు. అమ్మోనియం నైట్రేట్, సల్ఫర్‌, అల్యూమినియం పౌడర్‌లను పోలీసులు సీజ్ చేశారు.

 

సిరాజ్‌, సమీర్‌‌ను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసలు రిమాండ్‌ రిపోర్ట్‌లో చాలా కీలక అంశాలు వెల్లడించడం జరిగింది. మొత్తం ఆరుగురు యువకులు కలిసి మూడ రోజుల పాటు హైదరాబాద్‌లో ఉన్నారు. ఇక్కడ మహారాష్ట్రకు చెందిన యువకులతో పాటు కర్ణాటక యువకులు మొత్తం ఆరుగురు కలిసి ఒకే చోట ఉండి హైదరాబాద్ లో బాంబులు ఎక్కడెక్కడ అమర్చాలి, ఎలా తయారు చేయాలి వాటికి సంబంధించిన స్పాట్లు ఎలా గుర్తించాలి అని ప్లాన్లు వేసారు. అయితే సౌదీ, అరేబియన్ నుంచి వీరికి ఇంటర్నెట్ ద్వారా ఆదేశాలు వచ్చినట్టుగా గుర్తించారు. టిఫిన్‌బాక్స్‌‌లో బాంబులు తయారు చేసి అవి జనాభా ఎక్కువగా ఉండే స్పాట్లో గుర్తించాలని ఆదేశాలు వచ్చినట్లుగా తెలుపారు. అయితే అమేజాన్‌లో టిఫిన్‌బాక్స్‌లు, వైర్లు, రిమోట్‌ సెల్స్‌ ఇవన్ని ఆర్డర్ చేసి కోనుగోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఎవరైతే సిరాజ్‌, సమీర్‌‌కు సంబంధించిన ఇన్‌స్టాగ్రాం అకౌంట్స్ పైనా కూడా పోలీసులు నిగా పెట్టడంతో కుట్ర భగ్నం అయ్యిందని తెలిపారు.

 

వీరు అన్‌లైన్ ద్వారనే ఉగ్రవాద అనుబంధాలకు ఆకర్షితులై హైదరాబాద్‌లో ఈ కార్యకలాపాలు చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు. వీరికి సంబంధించిన పూర్తి వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐసిస్‌ కి సంబంధించిన హ్యాండర్లను సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలను ఆక్కడ అమలు చేసే విధంగా సిరాజ్, సమీర్ కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. అయితే వీరు 3 రోజులు ఎక్కడ ఉన్నారు.. వీరికి ఎవరు ఆశ్రయం కల్పించారు అనేది వివరాలు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే NIA కూడా రంగంలోకి దిగింది. కేుసుకు సంబంధించి అన్ని వివరాలు తెలుసుకుంటుందని చెప్పారు. మొత్తం ఆరుగురు యువకులు అని చెప్పారు.. మిగత నలుగురు ఎక్కడికి వెళ్లారు. వారికి సంబంధించిన వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం తెలంగాణ, ఆంధ్ర పోలీసులు జాయిండ్ ఆపరేషన్ చేయడంతో హైదరాబాద్‌లో బాంబులు పేల్చేందుకు కుట్ర భగ్నం చేయగలిగారు.

 

అయితే గ్రూప్స్ ప్రిపరేషన్ కోసం వచ్చిన సిరాజ్, సమీర్ ఇద్దరు ఎలా పరిచయమయ్యారు అనే దాని గురించి ఇన్వేస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. వీరిని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకి వచ్చే అవకశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ సిరాజ్‌, సమీర్‌ కు ఎవరెవరు సహాయం చేస్తున్నారు.. వారికి బాంబులకు సంబంధించి ఎక్యూమెంట్ కొనడానికి ఆర్థిక పరమైన సహాయం ఎవరు చేశారని దర్యాప్తు చేస్తున్నారు.

Editor