శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం ఈ రోజు Ind.G.A.P. సర్టిఫికేషన్ ఉత్తమ వ్యవసాయ యాజమాన్య పద్ధతులు కోసం నల్లమాడ FPO ద్వారా APSOPCA ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రీయ ఉత్పత్తుల ధ్రువీకరణ సంస్థ కి నమోదు చేసుకోబడిన నల్లమాడ మండలానికి సంబంధించిన రైతుల పొలాలను మరియు రికార్డులను బి.వెంకటేష్ Evaluator, APSOPCA, శ్రీ సత్య సాయి జిల్లా, గారు పరిశీలించడం జరిగింది. రసాయన ఎరువులు మరియు పురుగు మందులను సిఫారసు మేరకు మాత్రమే వాడాలని రైతులకు సూచించారు. అధిక మోతాదులో వాడితే పంట ఉత్పత్తులలో పురుగు మందుల అవశేషాల కారణంగా మానవ ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుందని తెలియచేశారు. సేంద్రీయ ఉత్పత్తుల యొక్క ధ్రువీకరణ ప్రాముఖ్యతను తెలియచేసారు. ధృవీకరణ పొందిన పంట ఉత్పత్తులు అధిక ధరకు FPO ల ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపారు. పురుగు మందుల అవశేషాల పరీక్ష నిమిత్తం విత్తన నమూనాలను సేకరించి Lab కి పంపించారు. కార్యక్రమంలో అబ్దుల్ హక్ మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ సిబ్బంది మరియు FPO సిబ్బంది పాల్గొన్నారు.
ఉత్తమ వ్యవసాయ పద్ధతులతోనే అధిక లాభాలు: నల్లమాడలో Ind.G.A.P. సర్టిఫికేషన్ కోసం క్షేత్రస్థాయి పరిశీలన!
