రాజ్‌భవన్‌లో చోరీ..! కీలక హార్డ్ డిస్కులు మాయం..!

తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషయం ఆలోస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజ్‌భవన్‌లోని సుధర్మ భవన్ లో హార్డ్ డిస్కులు మాయం అయ్యాయి. వారం కిందట కొందరు వ్యక్తులు నాలుగు హార్డ్ డిస్క్‌లను చోరీ చేసినట్టు తేలింది.

 

చోరీకి గురైన హార్డ్ డిస్క్‌లో కీలకమైన సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. సీసీ పుటేజ్ ఆధారంగా గుర్తించారు రాజ్‌భవన్ అధికారులు గుర్తించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజ్‌భవన్ అధికారులు. చోరీకి చేసిన వ్యక్తి హెల్మెట్ ధరించినట్టు సమాచారం.

 

గవర్నర్ నివాసం అంటే ఆషామాషీ కాదు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత. నిత్యం పోలీసులు, అధికారులతో బిజీగా ఉంటుంది. చీమ చిటుక్కు మన్నా క్షణాల్లో ఇట్టే తెలిసిపోతుంది. నిరంతరం బలగాలు పహారా, ఆపై సీసీ కెమెరాలతో నిఘా ఉంటుంది. అలాంటి తెలంగాణ రాజ్‌భవన్ లో దొంగతనం జరిగిన విషయం కలకలం రేపుతోంది.

 

రాజ్‌భవన్‌లోకి చోరీకి వచ్చిన వ్యక్తి తిరిగి ఎలా వెళ్లగలిగాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఏ టెక్నీషియన వచ్చినా ముఖానికి హెల్మెట్‌ పెట్టుకుని కంప్యూటర్‌ రూమ్‌లోకి ఎలా చొరబడ్డాడు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చోరీ వెనుక ఇంటి దొంగ ఏమైనా ఉందా? లేక వేరేవారి పాత్ర ఉందా అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

 

తెలంగాణలో మరో సంచలనం చోటు చేసుకుంది. రాజ్‌భవన్‌లో దొంగలు పడ్డారు. నిత్యం హై సెక్యూరిటీతో ఉండే రాజ్‌భవన్‌లో ఓ అగంతకుడు చేతి వాటం ప్రదర్శించాడు. మే 14న ఓ వ్యక్తి రాజ్‌భవన్ వచ్చాడు. హెల్మెట్ ధరించి నాలుగు హార్డ్ డిస్క్‌లను చోరీ చేశాడు. సుధర్మ భవన్‌లో నాలుగు హార్డ్ డిస్క్‌లు మాయం అయినట్లు రాజ్‌భవన్ సిబ్బంది గుర్తించారు.

 

సీసీటీవీ ఫుటేజ్‌లో ఆ గంతకుడు హార్డ్ డిస్క్‌లు తీసుకెళ్తున్నట్లు కనిపించింది. వెంటనే కంప్యూటర్ రూమ్‌కి వెళ్లి చెక్ చేశాడు. మే 20న అంటే మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

 

మొదటి అంతస్తులో ఉన్న రూమ్ నుంచి ఆ హార్డ్‌ డిస్క్‌లను ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు.హార్డ్‌డిస్క్‌లలో రాజ్‌భవన్ వ్యవహారాలు, కీలకమైన రిపోర్ట్‌లు, ఫైల్స్‌ ఉన్నట్టు అంతర్గత సమాచారం. 14న కంప్యూటర్‌ రూమ్‌లోకి వెళ్లింది ఎవరు? అనేదానిపై పోలీసులు దృష్టి సారించారు.

 

రాజ్‌భవన్‌లోనే కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌‌ని గుర్తించారు పోలీసులు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిసింది. అనంతరం శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించనున్నారు. ఈ హార్డ్ డిస్కులలో ఏ విధమైన సమాచారం ఉందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Editor