Latest Posts

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. ఐదో రోజు సునీల్ నాయక్ విచారణ

విజయవాడ

 

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ నాయక్ విచారణ ఐదో రోజు కొనసాగుతోంది. సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన్ను పోలీసులు ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ ఘటనపై సీన్ రీక్రియేషన్ చేసినట్లు సమాచారం. అనంతరం ఆయన్ను సీఐడీ కార్యాలయం నుంచి గుంటూరు సీసీఎస్ స్టేషన్కు తరలించారు. విజయనగరం ఎస్పీ దామోదర్.. సునీల్ నాయక్ను ప్రశ్నిస్తున్నారు. సోమవారం సాయంత్ర 5 గంటల వరకు సీసీఎస్ స్టేషన్లో విచారణ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Posted Under AP
Editor