Latest Posts

వైభవంగా కదిరి కాటంరాయుని బ్రహ్మరథోత్సవం: భక్తులతో పోటెత్తిన పురవీధులు

“కదిలింది కదిరి కాటంరాయుడు బ్రహ్మరథోత్సవం “. కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ సందర్భంగా డ్రోన్లతో ప్రత్యేక నిఘా జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారు, ట్రాఫిక్ ఆంక్షలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు, నాలుగు దిక్కులు ఏకమయ్యేలా గోవింద నామస్మరణలతో మారుమ్రోగిన ఖాద్రీ నరసింహుని బ్రహ్మరథోత్సవం, సర్వాంగ సుందరమైన శ్రీదేవి భూదేవి సమేత కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుండి వచ్చిన భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించడానికి కదిరి పట్టణ పురవీధుల్లో విహరిస్తూ అశేష భక్తజన సందోహంలో దర్శనమిచ్చారు. “జయ జయ సింహ, జయ నరసింహ “, అంటూ గోవింద నామస్మరణలతో భక్తులు పోటెత్తారు. ఈ ఖాద్రిసుని బ్రహ్మరథోత్సవానికి వచ్చిన భక్తులకు కనీస అవసరాల నిమిత్తం అవసరమయ్యే తాగునీటి సదుపాయం, మజ్జిగ, భోజన వసతి సౌకర్యం, అత్యవసర పరిస్థితుల కోసం వైద్య సిబ్బంది ని, అంబులెన్స్ సదుపాయాలను, మునిసిపల్ వెహికల్స్ ను భారీగా కల్పించారు. భక్తులు ప్రశాంతంగా,భక్తిశ్రద్ధలతో రథోత్సవ వేడుకలు దర్శించుకునేలా అన్ని విభాగాల సమన్వయంతో పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు తెలిపారు. ఈ ఖాద్రిసుని బ్రహ్మరథోత్సవంలో ముఖ్యంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు, కలెక్టర్ గారు, ఆర్డిఓ గారు,ఆలయ క్షేత్రం ఈవో శ్రీనివాస్ రెడ్డి గారు, సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు, కదిరి డిఎస్పి శివ నారాయణ స్వామి గారు, సి ఐ నారాయణ రెడ్డి గారు, నాగేంద్ర, ఎస్సైలు, మరియు పోలీస్ సిబ్బంది, మునిసిపల్ సిబ్బంది,ఆలయ కమిటీ సభ్యులు, ఆలయం యొక్క అర్చకులు,తదితరులు పాల్గొన్నారు. ఈ ఖాద్రీ లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మరథోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ, పోలీస్ సిబ్బందికి, ఆలయ సిబ్బందికి, మునిసిపల్ సిబ్బందికి YES9 టీవీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 🙏🙏” గోవిందా, గోవిందా “🙏🙏

Posted Under AP
Editor