బిజెపిని నమ్ముకుని రఘురామకృష్ణంరాజు మోసపోయారు. బిజెపి అండగా నిలుస్తుందని గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆయన వైసీపీకి రెబెల్ గా మారారు. గెలిచింది వైసీపీ నుంచి అయినా.. తన సొంత పార్టీ బిజెపి అన్నంత రేంజ్ లో వ్యవహరించారు. కచ్చితంగా నరసాపురం నుంచి బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని కూడా ధీమాతో ఉండేవారు. బిజెపి అంతర్గత రాజకీయాలతో రఘురామరాజుకు టిక్కెట్ లేకుండా చేశారు. అయితే తనకు టిక్కెట్ రాకపోవడాన్ని జగన్ విజయంగా రఘురామకృష్ణం రాజు అభివర్ణించారు. బిజెపిలోని ప్రో వైసిపి నేతలతోనే ఈ తతంగం నడిపించారని ఆరోపించారు. అయినా సరే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని కచ్చితంగా చెప్పుకొచ్చారు రఘురామకృష్ణంరాజు.
అన్నట్టుగానే రఘురామకృష్ణం రాజు కోసం చంద్రబాబు రంగంలోకి దిగారు.రఘురామను టిడిపిలో చేర్చుకుంటామని.. నరసాపురం లోక్సభ స్థానాన్ని టిడిపికి విడిచి పెడితే.. ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని బిజెపికి విడిచిపెడతామని చంద్రబాబు ఆఫర్ పెట్టారు. కానీ అందుకు బిజెపి నాయకత్వం అంగీకరించలేదు. ఇప్పటికే నరసాపురం ఎంపీ అభ్యర్థిగా భూపతి రాజు శ్రీనివాస వర్మను బిజెపి ప్రకటించింది. ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లో మార్చబోమని బిజెపి అధినాయకత్వం తేల్చి చెప్పింది.దీంతో రఘురామకృష్ణంరాజుకు ఎక్కడో ఓ చోట సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఎదురైంది. రఘురామకృష్ణంరాజు పోటీ చేయకుంటే.. అది జగన్ విజయం గా మారుతుందని చంద్రబాబు అంచనా వేశారు. అదే సమయంలో రఘురామకృష్ణంరాజు సైతం ఒక బెట్టు దిగారు. అసెంబ్లీ నియోజకవర్గమైన పర్వాలేదని ముందుకు వచ్చారు. అందుకే చంద్రబాబు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు.
చంద్రబాబు పాలకొల్లు పర్యటనలు రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. వెంటనే ఆయనకు ఉండి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించుకున్నారు. నరసాపురం పార్లమెంట్ స్థానం పరిధిలో ఉండి నియోజకవర్గం ఉంది. ఇప్పటికే అక్కడటిడిపి అభ్యర్థిని ప్రకటించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సముచిత న్యాయం కల్పిస్తామని అభ్యర్థికి హామీ ఇచ్చారు.అటు రఘురామకృష్ణంరాజు నుంచి ఆర్థిక భరోసా దక్కినట్లు తెలుస్తోంది.దీంతో సదరు టిడిపి అభ్యర్థి పక్కకి తప్పుకునేందుకు అంగీకరించినట్లు సమాచారం.కేవలం ఎమ్మెల్యే గానే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కీలక పదవి ఇస్తామని చంద్రబాబు రఘురామకృష్ణం రాజుకు హామీ ఇచ్చినట్లు సమాచారం.మొత్తానికైతే రఘురామకృష్ణం రాజు కోసం చంద్రబాబు పెద్ద రిస్క్ చేస్తున్నారు. మరి ఆ రిస్కుకు తగ్గట్టు రఘురామకృష్ణంరాజు ఎంతవరకు సత్తా చాటుతారో చూడాలి.