ముఖ్యమంత్రిగా రేవంత్..
తెలంగాణ మూడో ముఖ్యమంత్రిగా కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. అంతకుముందు తన ప్రమాణ స్వీకారానికి హాజరైన సోనియాగాంధీని వెంట తీసుకుని ఎల్‌బీ స్టేడియంకు చేరుకున్నారు. వేదికపైకి తీసుకువచ్చి ఆశీనురాలును చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు ప్రియాంక, రాహుల్‌గాంధీతోపాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యా, ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌తోపాటు పలువుగరు కాంగ్రెస్ నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. అశేష జనం మధ్య రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణం చేశారు.
ఉప ముఖ్యమంత్రిగా బట్టి..
ఉప ముఖ్యమంత్రిగా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క ప్రమాణం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజ్ ప్రమాణం చేయించారు.
మంత్రులుగా పది మంది..
ఇక మంత్రులుగా వరుసగా ఆందోల్ ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహ, హుజూర్‌గర్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే కొండా సురేఖ, ములుగు ఎమ్మెల్యే అనసూయ(సీతక్క), ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వర్‌రావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ప్రమాణం చేశారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దనసరి అనసూయ(సీతక్క) ఇద్దరు మనస్సాక్షిగా ప్రమాణం చేశారు. మిగతా అందరూ దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు.