అజిత్,అల్లు అర్జున్ మల్టీస్టారర్…?

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న రైటర్ విజయేంద్ర ప్రసాద్… ఈయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత రామ్ చరణ్,ఎన్టీఆర్ లను హీరోలు గా పెట్టి రాజమౌళి తీసిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ఇంటర్నేషనల్ స్థాయి రైటర్ గా ఎదిగారు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు కూడా అతనే కథను అందిస్తున్నాడు. అంటే తమిళ్ సూపర్ స్టార్ అయిన అజిత్,అలాగే తెలుగులో ఐకాన్ స్టార్ గా మంచి గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ఇద్దరిని పెట్టి ఒక మల్టీ స్టారర్ సినిమాకి స్టోరీ అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా మీద జనాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

 

More

From Tollywood

అయితే అజిత్ లాంటి ఒక స్టార్ హీరో ఇమేజ్ ని,అలాగే అల్లు అర్జున్ స్టైలిష్ క్యారెక్టర్లను మ్యాచ్ చేస్తూ ఒక అద్భుతమైన కథను రాసినట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఈ కథ ఫైనల్ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరిని పెట్టి ఒక మంచి స్టోరీ రాయాలనే ఆలోచన విజయేంద్ర ప్రసాద్ గారికి రావడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఎందుకంటే తమిళం లో అజిత్ ఒక మంచి నటుడుగా చాలా సంవత్సరాల పాటు గుర్తింపుని పొందుతున్నాడు.ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ కి కూడా పుష్ప సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు రావడం జరిగింది.

 

ఇక వీళ్లిద్దరిని కలుపుతూ ప్రస్తుతం ఆయన మల్టీస్టారర్ సినిమా స్టోరీ రాయడం వల్ల అటు అజిత్ అభిమానులు, ఇటు అల్లు అర్జున్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా రాజమౌళి వ్యవహరించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.ఇక మహేష్ బాబు సినిమా తర్వాత రాజమౌళి ఈ సినిమాని చేయబోతున్నాడనే టాకైతే టోటల్ ఇండియా వైడ్ గా వినిపిస్తుంది. ఇక అందులో భాగంగానే ఈ స్టోరీ కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసి దానిని ఫినిష్ చేస్తున్నారు.ఇక ఆ లోపులో తొందరగా మహేష్ బాబు సినిమా చేసేసి ఆ వెంటనే రాజమౌళి అజిత్,అల్లు అర్జున్ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

 

ఇక విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ మొత్తాన్ని రెఢీ చేసి అజిత్ కి , అల్లు అర్జున్ కి చెప్పి ఉంచారంట వాళ్ళిద్దరూ కూడా ఓకే అనడంతో ఆ సినిమా కి సంబంధించిన డైలాగ్స్ ని విజయేంద్ర ప్రసాద్ దగ్గరుండి మరి రాయిస్తున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమా కి సాయి మాధవ్ బుర్ర డైలాగ్ రైటర్ గా వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందొ చూడాలి…

Editor