కరివేపాకులో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

కూరలో కరివేపాకు వస్తే పక్కన పడేస్తారు.. కానీ కరివేపాకును తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.. వంటలల్లో కరివేపాకును వేయడం వల్ల వంటల రుచి, వాసన పెరగడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.

కరివేపాకులో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కరివేపాకును తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చన్న సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే ఈ కరివేపాకును వంటల్లో వేయడానికి బదులగా కరివేపాకు నీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..

ఈ నీటిని ఎలా తయారు చేసుకోవాలంటే.. కొన్ని ఫ్రెష్ కరివేపాకులను తీసుకొని నీటిలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిని మరిగించి వడకట్టి తాగాలి. ఇలా కరివేపాకు నీటిని తయారు చేసుకుని తాగడం వల్ల మనం ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.. ఈ నీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం..

శరీరంలో మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. శరీరం శుభ్రపడుతుంది. అలాగే శరీరంలో రోగని రోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము..కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడటంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.. గుండె సంబంధిత సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. ఇక కరివేపాకు నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రేగు కదలికలు చురుకుగా ఉంటాయి. అంతేకాకుండా కరివేపాకు నీటిని తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది..కండరాలకు, నరాలకు విశ్రాంతి లభిస్తుంది.. వెంట్రుకలు కూడా బాగా పెరుగుతాయి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలను తగ్గిస్తాయి.. మీరు ఒక్కసారి తాగి చూడండి ఏం జరుగుతుందో చూడండి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

YES9 TV