వైద్యురాలిని బోల్తాకొట్టించిన నైజీరియన్లు.. రూ.13 లక్షలు స్వాహా..

ప్రస్తుతం దాదాపు అందికి సోషల్ మీడియాలో అకౌంట్లు ఉన్నాయి. సోషల్ మీడియా వాడాడమే కాదు.. వాటితో జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు చాలా మందిని మోసం చేస్తున్నారు.

తాజాగా ఓ డాక్టర్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి రూ.13 లక్షలు పోగొట్టుకుంది. ఢిల్లీలో ఓ వైద్యురాలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. ఓ నైజీరియన్ ఆమెకు వాట్సప్ పెళ్లి ప్రపోజల్ చేశాడు. తాను కూడా డాక్టర్ అని చెప్పుకున్నాడు. ఇలా వైద్యురాలి వద్ద విడతల వారీగా రూ.13 లక్షలు కాజేశాడు.

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన మహిళా వైద్యురాలు పెళ్లి కోసం మ్యాట్రిమోనియల్ సైట్ లో నమోదు చేసుకుంది. అందులో తనకు సంబంధించిన వివరాలు నమోదు చేసింది. అయితే ఇదే మ్యాట్రిమోనియల్ సైట్ లో కొంత మంది నైజిరియన్లు నకిలీ ఫొటో, వివరాలతో నమోదు చేసుకున్నారు. సదరు వైద్యురాలని గుర్తించిన నైజిరియన్ మ్యాట్రిమోనియల్ సైట్ ఉన్న నంబర్ కు వికాస్ కుమార్ అనే పేరుతో వాట్సప్ చేశాడు. తన కూడా డాక్టర్ అని విదేశాల్లో పని చేస్తున్నానని.. త్వరలో ఇండియాకు వచ్చి ఆస్పత్రి పెట్టనున్నట్లు చెప్పాడు.

“వికాస్ కుమార్ అనే వ్యక్తి మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయడం అయ్యాడు. తర్వాత ఫోన్ చేశాడు. వాట్సప్ సందేశాలు పంపాడు. తాను స్కాట్లాండ్‌లో ఉంటున్నానని వికాస్ చెప్పాడు. మీమిద్దరం చాలా కంలో ఫోన్లలో, వాట్సప్ లో చాటింగ్ చేసుకున్నారు. కొంత కాలం తర్వాత వికాసమ తనకు పెళ్లి ప్రపొజల్ చేశాడు. పెళ్లి నేను అంగీకరించాను. తన పుట్టిన రోజు సందర్భంగా వికాస్ బహుమతి కూడా పంపాడు” అని బాధితురాలు పోలీసులకు తెలిపింది. తర్వాత తనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని చెప్పింది.

ఫోన్లో ఓ వ్యక్తి తాను కస్టమ్ డిపార్ట్ మెంట్ నుంచి మాట్లాడుతున్నాననని చెప్పాడని తెలిపింది. మీకు స్కాట్లాండు నుంచి బహుమతి వచ్చిందని.. అది మీకు చేరాలంటే రూ.35 వేలు చెల్లించాలని చెప్పాడని వివరించింది. దీంతో తాను అతని ఖాతాలో రూ.35 వేలు జమ చేసినట్లు పేర్కొంది. వైద్యురాలికి మరుసటి రోజు మరో ఫోన్ వచ్చింది. మీ స్కాట్లాండ్ నుంచి మీ పార్శిల్‌లో విదేశీ కరెన్సీ ఉందని, దాని కోసం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో ఆమె మరో రూ.50 వేలు పంపింది.

YES9 TV