Latest Posts

ప్రతి ఊరుకి తాగునీరు… ప్రతి ఇంటికి కుళాయి

అనంతపురం జిల్లా ఉరవకొండ

ప్రతి ఊరుకి తాగునీరు… ప్రతి ఇంటికి కుళాయి

ఉరవకొండ నియోజకవర్గ ప్రజల దశాబ్దాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక అడుగు పడింది.

రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి ప్రత్యేక కృషితో, ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ కింద ₹480 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన “ప్రతి ఊరుకు నీరు – ప్రతి ఇంటికి కుళాయి” అనే హామీ నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు తెలిపారు.

ఈ ప్రాజెక్టుతో ఉరవకొండ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందడంతో పాటు మహిళలకు నీటి కష్టాలు తొలగి, ప్రాంత అభివృద్ధికి ఇది ఒక మైలురాయిగా నిలవనుంది.

ఈ ప్రతిపాదనను ఆమోదించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రి పయ్యావుల కేశవ్ గారు కేబినెట్‌లో కృతజ్ఞతలు తెలిపారు.

Posted Under AP
Editor